Hyderabad: బంజారా హిల్స్ సిటీ సెంటర్ మాల్ లో దారుణం

Hyderabad: ప్లేజోన్‌లోని మెషీన్‌లో పడి తెగిపోయిన మూడేళ్ల చిన్నారి చేతివేళ్లు

Dhatripriya
Published on: 7 May 2023 5:10 PM IST
Child Injured In Banjara Hills City Center Mall
X

Hyderabad: బంజారా హిల్స్ సిటీ సెంటర్ మాల్ లో దారుణం

Hyderabad: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్లేజోన్‌లోని మెషీన్‌లో పడి మూడేళ్ల చిన్నారి చేతివేళ్లు తెగిపోయాయి. హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. చిన్నారి చేతివేళ్లకు వైద్యులు సర్జరీ చేశారు. సిటీ సెంటర్‌ యాజమాన్యంపై చిన్నారి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డాడు. సరైన రక్షణ ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్వాహకులపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు పోలీసులు.

Dhatripriya

Dhatripriya

Next Story