Chikoti Praveen: థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్‌తో పాటు అరెస్టైన వారిలో ప్రముఖులు

Chikoti Praveen: అరెస్టైన వారిలో మెదక్ DCCB చైర్మన్ దేవేందర్

Jyothi
Published on: 2 May 2023 9:45 AM IST
Chikoti Praveen Arrested in Thailand
X

Chikoti Praveen: థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్‌తో పాటు అరెస్టైన వారిలో ప్రముఖులు 

Chikoti Praveen: థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్‌తో పాటు అరెస్టైన వారిలో ప్రముఖులు ఉన్నారు. అరెస్టైన వారిలో మెదక్ DCCB చైర్మన్ దేవేందర్‌తో పాటు.. హైదరాబాద్‌కు చెందిన VRA వాసు, ఇసుక వ్యాపారి సాగర్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సుదర్శన్‌రెడ్డి, భరత్ రెడ్డి, మల్లిఖార్జునరావు, బిల్డర్ మధు, మాధవరెడ్డి, వర్మ, తిరుమలరావు, బొమ్మిడి, మధుసుదన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్‌లో రెండు సార్లు చికోటి ఈవెంట్లు నిర్వహించాడు. ఏప్రిల్ 11 నుంచి 18 వరకు గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లు థాయ్‌పోలీసులు గుర్తించారు. గోవాకు చెందిన వ్యక్తి ఇచ్చిన పక్కా సమాచారంతో థాయ్‌లాండ్‌లోని ఏషియా హోటల్‌పై పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story