కరోనా ఎఫెక్ట్ : భారీగా పడిపోయిన బిర్యానీ ఆర్డర్లు

Corona Virus Chicken Biryani
x
chicken biryani
Highlights

కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు మాములుగా లేదు.. ఓ నలుగురు కలిస్తే కచ్చితంగా దిని గురించే చర్చ నడుస్తోంది. ఎన్నడు లేనంతగా ఈ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు

కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు మాములుగా లేదు.. ఓ నలుగురు కలిస్తే కచ్చితంగా దిని గురించే చర్చ నడుస్తోంది. ఎన్నడు లేనంతగా ఈ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే యాబై దేశాలకి పైగా వ్యాపించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో 3000 మందికి పైగా మరణించగా, ప్రపంచ వ్యాప్తంగా 90,000 మందికి పైగా చనిపోయారు. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్లపైన కూడా పడింది.

ఇక ప్రజలు చికెన్, మటన్ తినాలంటే ఒక్కటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ వైరస్ జంతుమాసం నుంచి ఎక్కువగా వస్తుందన్న ప్రచారం ఎక్కువ సాగడంతో చికెన్ రేట్స్ కూడా భారీగానే పడిపోయాయి. ఇక హైదరాబాదులో కూడా బిర్యానీ ఆర్డర్లు కూడా సగానికి పడిపోయాయి. బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన భాగ్యనగరంలో హోటళ్లు, రెస్టారెంట్ లలో బిజినెస్ బాగా తగ్గింది. చికెన్ తినే నాధుడే లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

ఇక చికెన్ తింటే కరోనా రాదని,స్వయంగా తిని మంత్రి కేటీఆర్ చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం చికెన్ ఫుడ్ కి కాస్తా దూరంగానే ఉంటున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమపైన ఎఫెక్ట్ భారీగానే పడింది. ఒకప్పడు నిమిషానికి 95 చికెన్ బిర్యానీలు ఆర్డర్ అయ్యేవి కానీ ఇప్పుడు బిర్యానీ అంటే వద్దు బాబోయ్ అనే పరిస్థితిని కరోనా కల్పించింది. దీనితో రెస్టారెంట్లు, హోటళ్ళు బిర్యానీ ఆర్డర్లు లేకా వెలవెలబోతున్నాయి. ఇక స్వచ్చమైన కూరగాయల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సూపర్ మార్కెట్లలో సాయింత్రం వేళ ఫుల్ రష్ ఏర్పడుతోంది.

చైనాలో తగ్గుముఖం :

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. గతంతో పోలిస్తే అక్కడ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతోంది. కొవిడ్-19 వ్యాప్తిపై అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ సమీక్ష నిర్వహించింది. కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వారు మరోసారి దీని బారిన పడే అవకాశం ఉందా అనే విషయంపై అక్కడి అధికారులు చర్చించినట్టు తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories