Anganwadi: ఉడికిన గుడ్డులో కోడిపిల్ల.. షాక్ కు గురైన చిన్నారుల పేరెంట్స్..

Chick in Egg: హైదరాబాద్ అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, కిశోర భాలికలు, గర్భిణీలకు పెట్టే ఆహారంలో నాణ్యత లోపిస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Oct 2024 10:54 AM IST
Chick Hatched From an Egg Distributed by Anganwadi
X

Anganwadi: ఉడికిన గుడ్డులో కోడిపిల్ల.. షాక్ కు గురైన చిన్నారుల పేరెంట్స్..

Chick in Egg: హైదరాబాద్ అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, కిశోర భాలికలు, గర్భిణీలకు పెట్టే ఆహారంలో నాణ్యత లోపిస్తోంది. తాజాగా చిన్నారులకు ఇచ్చే ఉడకబెట్టిన గుడ్డులో కోడిపిల్ల రావడం సంచలనంగా మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఓ అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు గుడ్లు పంపిణీ చేశారు. ఆ గుడ్లను ఇంటికి తీసుకెళ్లిన లబ్ధిదారులు ఉడకబెట్టి పొట్టు తీయగా.. చనిపోయిన కోడిపిల్ల ప్రత్యక్షం కావడంతో చిన్నారుల పేరెంట్స్ షాక్ కు గురయ్యారు.

ఇదేమిటని అంగన్ వాడీ టీచర్ ను ప్రశ్నించగా.. ప్రభుత్వం సరఫరా చేసిన గుడ్లనే తాను పంపిణీ చేసినట్లు ఆమె సమాధానమిచ్చింది. దీంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల పాడైపోయిన గుడ్లు తిని చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ తీసుకొని చిన్నారులకు సరైన గుడ్లు ఇవ్వాలంటూ స్థానికులు మొరపెట్టుకుంటున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story