Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి కరోనా..

Ranjith Reddy: తనను కలిసిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచన...

Shireesha
Updated on: 26 Dec 2021 8:30 AM IST
Chevella MP Ranjith Reddy Tested Coron Positive | Corona Live Updates
X

Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి కరోనా.. 

Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎంపీ వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. వైద్యులను సంప్రదించి, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనను కలిసిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కాగా, తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ తనను కలవడానికి రావద్దని ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు పీఏ, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, ప్రజలు సహకరించాలని కోరారు ఎంపీ రంజిత్‌రెడ్డి.

Shireesha

Shireesha

Next Story