బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా

Ranjith Reddy: తన రాజీనామాను కేసీఆర్‌కు పంపిన రంజిత్ రెడ్డి

Jyothi
Published on: 17 March 2024 12:11 PM IST
Chevella MP Ranjith Reddy Resigns From BRS
X

బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా

Ranjith Reddy: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో సంచలన షాక్ తగిలింది. ఆ పార్టీ మరో సిట్టింగ్‌ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. అనంతరం తన రాజీనామా విషయాన్ని ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు.

ఇన్ని రోజులు చెవేళ్ల ప్రజలను సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తన రాజీనామాను ఆమోదించాలని గులాబీ పార్టీ అధినేతను రంజిత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story