Telangana: మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిరుత కలకలం

Telangana: దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో లేగదూడపై దాడి

Sandeep Eggoju
Published on: 19 Feb 2021 1:13 PM IST
Cheetah Fear in Mahbubnagar District
X

చిరుత పులి (ఫైల్ ఇమేజ్)

Telangana: మహబూబ్‌నగర్‌ జిల్లాలో వరుసగా చిరుత పులుల సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గత రెండు నెలల నుంచి మన్యం కొండ ప్రాంతంలో చిరుత సంచారం, కోయిలకొండ పరిసర ప్రాంతాల్లో చిరుత కనపడడం స్థానికుల్లో భయాందోళనలు రేకిస్తున్నాయి. తాజాగా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామ సమీపంలో లేగదూడపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో లేగదూడ మృతి చెందింది. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story