హైదరాబాద్‌లో వెలుగు చూస్తున్న పెట్రోల్ బంక్ మోసాలు

*ఎలక్ట్రానిక్ చిప్‌లతో పెట్రోల్‌కు గండికొడుతున్న బంక్ యజమానులు

Jyothi
Updated on: 17 Nov 2022 4:40 PM IST
Cheating In Hyderabad Petrol Bunks
X

హైదరాబాద్‌లో వెలుగు చూస్తున్న పెట్రోల్ బంక్ మోసాలు

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌ మోసాలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. ఎలక్ట్రానిక్ చిప్‌లతో బంక్ యజమానులు పెట్రోల్‌కు గండికొడుతున్నారు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఎస్‌‌వోటీ ఆకస్మిక తనిఖీలు చేశారు. శివరాంపల్లిలోని ఓ పెట్రోల్‌ బంకుపై సోదాలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ మిషన్‌లో సాఫ్ట్‌వేర్‌తో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. చిప్‌తో లీటర్‌కు 10 రూపాయలు గండి కొడుతూ.. వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో చిప్స్ అమర్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెట్రోల్ బంకుల యజమానులపై కేసులు నమోదు చేశారు.

Jyothi

Jyothi

Next Story