మాజీ మంత్రి హరీష్‌రావు బంధువులపై చీటింగ్‌ కేసు

Cheating Case: హైదరాబాద్‌ పరిధిలోని మియాపూర్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై కేసునమోదు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 18 Oct 2024 10:51 AM IST
Cheating Case Against Relatives of Harish Rao
X

మాజీ మంత్రి హరీష్‌రావు బంధువులపై చీటింగ్‌ కేసు

Cheating Case: హైదరాబాద్‌ పరిధిలోని మియాపూర్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై కేసునమోదు చేశారు. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురిపై మియాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తనకి తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు చేశారు. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని లచ్చిరాజు ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారని తెలిపారు.

2019 నుంచి ఇదే కేసువిషయమై పోరాడుతున్నారు. ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ట్రెస్‌పాస్, బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీనోటు తీసుకుని చీటింగ్‌కి పాల్పడ్డారని కేసునమోదు చేశారు. ఈ వ్యవహారంలో తన్నీరు గౌతం, బోయినపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మాజారావుపై పోలీసులు కేసునమోదు చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story