Khammam: ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి మార్పులు

Khammam: కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ విగ్రహంలో మార్పుచేస్తున్న నిర్వహకులు

Dhatripriya
Updated on: 19 May 2023 3:15 PM IST
Changes to NTR statue at Khammam Lakaram Tank Bund
X

Khammam: ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి మార్పులు

Khammam: ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌లో శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నిర్వహకులు మార్పులు చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు, యాదవ సంఘాలను గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నారు. నీలిమేఘ శ్యాముడుగా ఉన్న శ్రీ కృష్ణుడుకి కలర్ మార్చి గోల్డ్ కలర్ వేశారు. విగ్రహం నుండి కిరీటం, నెమలి పింఛం, విష్ణు చక్రం, పిల్లన గ్రోవీలను తొలగించారు. ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణ జరుగుతుందని నిర్వహకులు చెబుతున్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సినీరంగ ప్రముఖులు, ఎన్ ఆర్ ఐలు హాజరుకానున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story