Chandrababu Naidu Greet Congress MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకి చంద్రబాబు, లోకేష్ బర్త్ డే విషెస్!

Chandrababu Naidu Greet Congress MLA Seethakka: తెలంగాణ కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ ధరసరి అనసూయకు టీడీపీ అధినేత చంద్రబాబు, అయన కుమారుడు నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

Krishna
Updated on: 9 July 2020 10:02 PM IST
Chandrababu Naidu Greet Congress MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకి చంద్రబాబు, లోకేష్ బర్త్ డే విషెస్!
X
chandra babu greet to mla sithakka

Chandrababu Naidu Greet Congress MLA Seethakka: తెలంగాణ కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ ధరసరి అనసూయకు టీడీపీ అధినేత చంద్రబాబు, అయన కుమారుడు నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. " సీతక్క గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ నియోజకవర్గానికి మీరు చేస్తున్న మంచి పనులను కొనసాగించడానికి వీలుగా దేవుడు మీకు శక్తిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అమ్మా" అంటూ చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నారా లోకేష్ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కరోనా సంక్షోభ సమయంలో అద్భుతంగా సేవలందించిన ఆమెకు కంగ్రాట్స్ తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని లోకేష్ ఆకాంక్షించారు. అటు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక అటు సీతక్క.. 20 ఏళ్లకే నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం 2004లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై గెలిచి రెండవసారి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు.

ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఆమె ఏజెన్సీ ప్రాంతాల్లో కాలినడకన తిరుగుతూ గిరిజనులకు కూరగాయలు, బియ్యం ఉచ్చితంగా పంచిపెట్టారు. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి గాను ఆమె చేసిన కృషికి అందరు ఫిదా అయిపోయారు.

Krishna

Krishna

Next Story