Chandrababu Naidu Fires on YCP government : వైఎస్ వివేకా హత్య జరిగి 13 నెలలైనా హంతకులను పట్టుకోలేకపోయారు.. ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

Chandrababu Naidu Fires on YCP government: వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 13 నెలలైనా హంతకులను పట్టుకోలేకపోయారని జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారుt :
Chandrababu Naidu Fires on YCP government: వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 13 నెలలైనా హంతకులను పట్టుకోలేకపోయారని జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన కారణంగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు. చీమకు కూడా అపకారం చేయని మనిషి కొల్లు రవీంద్ర అని ఆయన అన్నారు. పార్టీ నాయకులతో ఆయన ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. ఈ మేరకు పార్టీ నాయకులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొల్లు రవీంద్రను ఇరికించేందుకే కాల్స్ డ్రామా ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని, రెండు కుటుంబాల మధ్య కక్షలను రెచ్చగొట్టింది వైసిపినే అని ఆయన ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ఇళ్లను ఇంతవరకు పేదలకు అందించలేదని, టీడీపీపై కక్షతోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారనీ మండిపడ్డారు. హౌసింగ్ పెండింగ్ బిల్లులు, ఇళ్ల స్వాధీనంపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో వైసీపీ వేధింపులపై సోమవారం నుంచి నిరసనలు తెలపాలని పార్టీ నేతలకు సూచించారు. ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై ఈ నెల 7న నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో మంత్రి పేర్ని నాని అనుచరుడు, వైసీపీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. మోకా భాస్కర్‌రావును కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Vikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMTనిర్మాతలకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయనున్న పవన్ కళ్యాణ్
25 Jun 2022 2:30 PM GMTVasireddy Padma: రాష్ట్ర మహిళా కమిషన్ తరపున ఆర్జీవీకి నోటీసు ఇస్తాం..
25 Jun 2022 2:02 PM GMTGreen Fennel: పచ్చిసోంపు తింటే బీపీ కంట్రోల్.. ఇంకా ఈ ప్రయోజనాలు..!
25 Jun 2022 1:30 PM GMTSalaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.....
25 Jun 2022 1:00 PM GMT