Avanthi Srinivas to Chandrababu Naidu : ఆయన వ్యాఖ్యల వెనుక ఏం కుట్ర వుందో చెప్పాలి

Avanthi Srinivas to Chandrababu Naidu: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు జీవితాంతం కుట్ర రాజకీయాలే చేస్తారని మండిపడ్డారు.

Samba Siva Rao
Published on: 5 July 2020 5:55 PM IST
Avanthi Srinivas to Chandrababu Naidu : ఆయన వ్యాఖ్యల వెనుక ఏం కుట్ర వుందో చెప్పాలి
X

Avanthi Srinivas to Chandrababu Naidu: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు జీవితాంతం కుట్ర రాజకీయాలే చేస్తారని మండిపడ్డారు. చంద్రబాబు జూమ్ రాజకీయాలతో ఆర్గనైజ్ చేశారని విమర్శించారు. లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనీ మంత్రి అన్నారు.

అమరావతి అభివృద్ధికి 30 సంవత్సరాలు పడుతుందన్నారు. అమరావతి మీద వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి కక్షసాధింపు లేదని స్పష్టం చేశారు. సబ్బం హరి రాజకీయ ద్వేషంతో విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. 2022లో సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉండరని చెప్పిన సబ్బం హరి.. దాని వెనుక ఏం కుట్ర వుందో సమాధానం చెప్పాలనీ మంత్రి అన్నారు.

బ్రేక్ ఫాస్ట్ జపాన్ , మధ్యాహ్నం చైనా అంటూ రాజధానిపై చంద్రబాబు భ్రమలు సృష్టించారని ఎద్దేవా చేశారు. నిజంగా చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. అమరావతి కావాలో, విశాఖ కావాలో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారన్నారనీ మంత్రి సవాల్ విసిరారు. గతంలో ఎంపీగా విశాఖపట్నం ప్రజలు పురంధేశ్వరినీ

గెలిపించారని.. అయినా ఆమె కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఆయన విమర్శించారు.

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం బీజేపీ నేతలు ఏం చేశారనీ ప్రశ్నించారు. తప్పు చేసిన నాయకులను అరెస్ట్ చేస్తే బీసీ నాయకులు అంటారా ? అని నిలదీశారు. హత్య చేసిన వాళ్ళని మోసాలు చేసిన వారిని విడిచి పెట్టాలా ? అంటూ మంత్రి టీడీపీ నేతలను ప్రశ్నించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story