Telangana: రేపు తెలంగాణలో కేంద్రం బృందం టూర్.. వరద నష్టంపై నివేదిక ఇవ్వనున్న సెంట్రల్ టీమ్
Telangana: తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేయనున్న టీమ్
Telangana: రేపు తెలంగాణలో కేంద్రం బృందం టూర్.. వరద నష్టంపై నివేదిక ఇవ్వనున్న సెంట్రల్ టీమ్
Telangana: తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. తీవ్రస్థాయిలో కురిసిన వర్షాల కారణంగా.. పెద్ద ఎత్తున ఏర్పడిన వరదల మూలంగా అనేక జిల్లాలో నష్టాన్ని, పరిశీలించనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర అధికారుల బృందాన్ని తెలంగాణలో పర్యటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారుడు శ్రీ కునాల్ సత్యార్థి నాయకత్వం వహించనున్నారు.
కేంద్ర అధికారుల బృందం రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనుంది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనావేయనుంది. ప్రభుత్వం అందించనున్న వివరాలను కూడా జతపరుస్తూ.. కేంద్ర అధికారుల బృందం నివేదిక తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది.




