Top
logo

రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం

రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం
X
Highlights

హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు రేపు సాయంత్రం కేంద్ర బృందం రానుంది. వరద ప్రభావిత...

హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు రేపు సాయంత్రం కేంద్ర బృందం రానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం నష్ట తీవ్రతను అంచనా వేయనుంది. భారీ వరదలు ముంచెత్తుతున్న కారణంగా ఇటీవలే తక్షణ సాయంగా 13 వందల 50 కోట్లు కోరుతూ ప్రధానికి లేఖ రాశారు సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటించనుంది.

హైదరాబాద్‌లో వర్షం మోత మళ్లీ షురూ అయింది. తెల్లవారుజామునే భాగ్యనగరాన్ని చినుకులు పలకరించాయి. ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, సరూర్‌నగర్‌, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతాల్లో ఉదయాన్నే భారీ వర్షం కురిసింది.

Web TitleCentral team to visit Hyderabad flood-affected areas tomorrow
Next Story