Central Distributes PPE Kits, masks for Telangana: ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం

Central Distributes PPE Kits, masks for Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా సాయం విషయంలో కేంద్రం భారీగా చేయూతనందించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Sumitra
Published on: 4 Aug 2020 1:53 PM IST
Central Distributes PPE Kits, masks for Telangana:  ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం
X
ppe kits

Central Distributes PPE Kits, masks for Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా సాయం విషయంలో కేంద్రం భారీగా చేయూతనందించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోదాడకు చెందిన జలగం సుధీర్‌ అనే సామాజిక కార్యకర్త తెలంగాణకు కరోనా విషయంలో వైద్య పరంగా ఎలాంటి సహాయం అందించారో అన్న విషయంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుకు స్పందించిన కేంద్రం పూర్తి వివరాలను ప్రకటించింది. తెలంగాణకు కరోనా సాయంలో భాగంగా 1,400 వెంటిలేటర్లు, 2.44 లక్షల ఎన్‌–95 మాస్కులు, 10.9 లక్షల పీపీఈ కిట్లు, 42.50 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్‌ మాత్రలు అందజేసినట్లు వెల్లడించారు. హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ అనే సంస్థకు ఈ ప్రొక్యూర్‌మెంట్‌–డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలు అప్పజెప్పామని, ఆ సంస్థ ద్వారానే తెలంగాణ ప్రభుత్వానికి మాస్కులు, కిట్లు ఇతరత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపింది.

ఇకపోతే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, బాధితుల క్షేమ సమాచారాన్ని వారి వారి కుటుంబసభ్యులకు వెంటవెంటనే అందించాలని వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన వైద్య ఉన్నతాధికారులతో కలిసి గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆస్పత్రి పాలనా యంత్రాంగం, పలు విభాగాల హెచ్‌ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమస్యను పరిష్కరించేందుకు రోజూ రెండుసార్లు బాధితుల సమాచారాన్ని కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆస్పత్రిలో ఉన్న బాధితుల సమాచారం తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని దృష్టికి వచ్చిందన్నారు.

Sumitra

Sumitra

Next Story