రామగుండం రైల్వే స్టేషన్‌లో ఇండోనేషియా దేశస్థులు.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు..

Arun Chilukuri
Published on: 19 March 2020 5:17 PM IST
రామగుండం రైల్వే స్టేషన్‌లో ఇండోనేషియా దేశస్థులు.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు..
X

ఈ నెల 14న రామగుండం రైల్వే స్టేషన్ కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. రైల్వే స్టేషన్ లో దిగి నడుస్తూ బయటకు వచ్చి అద్దె వాహనం మాట్లాడుతున్నారు. హెచ్ ఎంటీవీకి ఈ దృశ్యాలు లభించాయి. కరీంనగర్‌లో ఇండోనేషియా దేశస్థులు తిరిగిన ప్రాంతాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఇండోనేసియన్లు తీవ్ర కలకలం రేపుతున్నారు. ఓ మత సంబంధ కార్యక్రమం కోసం వచ్చిన వీరంతా కరీంనగర్‌కు కరోనాను తీసుకొచ్చారు. మొత్తం 12 మంది ఇండోనేసియన్ల బృందంలో 8 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వారంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఎవరెవరిని కలిశారు? అనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story