Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబు ర్యాలీపై NHRCలో కేసు నమోదు

Chandrababu: పోలీసులు వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కంప్లైంట్

Shekhar G
Published on: 7 Nov 2023 7:48 PM IST
Case Registered In NHRC Against Chandrababu Rally In Hyderabad
X

Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబు ర్యాలీపై NHRCలో కేసు నమోదు 

Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబు చేపట్టిన ర్యాలీపై NHRCకి ఫిర్యాదు అందింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్ పై విడుదలైన సందర్బంగా తన మద్దతు దారులను కలిసేందుకు వచ్చిన చంద్రబాబు బేగంపేట నుంచి జూబ్లిహిల్స్‌లోని తన నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బంజారాహిల్స్ రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని.. అదే సమయంలో అంబులెన్స్‌కు దారి కూడా ఇవ్వలేదని హైకోర్ట్ న్యాయవాది ఇమ్మనేని రామారావు NHRCకి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఇమ్మనేని రామారావు ఫిర్యాదులో కోరారు.

Shekhar G

Shekhar G

Next Story