Bandi Sanjay: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు

Bandi Sanjay: మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో నిరసనలపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్

Jyothi
Published on: 28 March 2024 2:13 PM IST
Case registered against Karimnagar MP Bandi Sanjay
X

 Bandi Sanjay: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు

Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిన్న మేడ్చల్ జిల్లా చెంగిచర్ల జరిగిన నిరసనల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు పోలీసులు. నాచారం సీఐ నందీశ్వర్‌ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. పిట్టలబస్తీలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బండి సంజయ్‌ను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే బారికేడ్లను తోసుకుని.. పోలీసులను గాయపర్చి వెళ్లారని సీఐ నందీశ్వర్‌రెడ్డి కంప్లయింట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story