Hyderabad: సెలవు తీసుకున్న డ్రైవర్‌.. డ్రైవర్ కనిపించడం లేదంటూ యజమాని పోస్టర్లు..

Hyderabad:సెలవు తీసుకున్న డ్రైవర్‌.. డ్రైవర్ కనిపించడం లేదంటూ యజమాని పోస్టర్లు..

Arun Chilukuri
Updated on: 28 April 2023 1:53 PM IST
Car Owner Erupts Posters on Driver
X

Hyderabad:సెలవు తీసుకున్న డ్రైవర్‌.. డ్రైవర్ కనిపించడం లేదంటూ యజమాని పోస్టర్లు..

Viral Poster: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ కారు డ్రైవర్ విధులకు హాజరు కావడం లేదనే కారణంతో ఆయన కనిపించడం లేదంటూ యజమాని పోస్టర్లు అంటించారు. డ్రైవర్ నివాసం ఉంటున్న రహ్మత్‌నగర్ ప్రాంతంలోని పిల్లలు చదువుకునే స్కూల్ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా ఆటోలకు కూడా కారు యజమాని అల్లుడు ప్రకాశ్ పోస్టర్లు అంటించారు. పోస్టర్లపై డ్రైవర్‌తోపాటు అతడి భార్య ఫోన్ నంబర్లను ముద్రించారు.

బంధువు చనిపోవడంతో సొంతూరుకు వెళ్లిన డ్రైవర్ రామకృష్ణ తిరిగి రాకపోవడంతో వేధించే లక్ష్యంతో యజమాని అల్లుడు ప్రకాశ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. గతంలో కూడా కాలు విరిగి ఇంట్లో ఉంటే యజమాని తన మనుషులను పంపి బలవంతంగా డ్యూటీకి లాక్కెళ్లాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు డ్రైవర్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. యజమాని నళిని.. ఆమె అల్లుడు ప్రకాశ్‌తో ప్రాణహాని ఉందని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story