గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

Hyderabad - Gachibowli: *ఈ తెల్లవారుజామున ప్రమాదం *అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు

Shireesha
Published on: 18 Dec 2021 9:21 AM IST
Car Accident in Gachibowli Hyderabad Killed 2 Junior Artists and Drive | Hyderabad News Today
X

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

Hyderabad - Gachibowli: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో హెచ్‌సీయూ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్, ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరో జూనియర్ ఆర్టిస్ట్ అయిన సిద్ధు గాయపడ్డాడు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ ఆర్టిస్టులు అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story