హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..

Banjara Hills: హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకువచ్చిన కారు

Arun Chilukuri
Updated on: 29 May 2023 9:15 AM IST
Car Accident in Banjara Hills Hyderabad
X

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..

Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొని అనంతరం హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకువచ్చింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బంజారాహిల్స్‌‌లోని రోడ్ నెంబర్‌-3లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొనడంతో సెక్యూరిటీ గార్డ్‌తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story