కూకట్‌పల్లిలో కారు బీభత్సం

X
Highlights
Kukatpally: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సౌత్...
Arun Chilukuri4 Sep 2020 11:09 AM GMT
Kukatpally: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఓ ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదానికి కారణం అతివేగమే అంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Web TitleCar Accident at Kukatpally
Next Story