హైదరాబాద్ లో విషాదం.. కరోనాకు మందు తెచ్చానంటూ..

హైదరాబాద్ లో విషాదం.. కరోనాకు మందు తెచ్చానంటూ..
x
Highlights

హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్టలో విషాదం చోటుచేసుకుంది. అనీష్‌రెడ్డి అనే యువకుడు ఐటీ కంపెనీలో క్యాంటీన్‌ వ్యాపారం నిర్వహిస్తుండేవాడు....

హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్టలో విషాదం చోటుచేసుకుంది. అనీష్‌రెడ్డి అనే యువకుడు ఐటీ కంపెనీలో క్యాంటీన్‌ వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. కరోనా కారణంగా వ్యాపారం మూతపడ్డది. దీంతో ఉపాధి కోల్పోయిన యువకుడు మనస్తాపం చెంది కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. అనీష్‌రెడ్డి మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.

ఎర్రమంజిల్‌ హిల్‌టాప్‌ కాలనీలో ఆలంపాటి అనీష్‌రెడ్డి(35) తల్లిదండ్రులు ఆలంపాటి రామిరెడ్డి (61), శ్రావణిరెడ్డిలతో కలిసి నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అనీష్‌రెడ్డి కరోనాకు మందు తెచ్చానంటూ తల్లిదండ్రులను నిద్రలేపాడు. మూడు గ్లాసుల్లో పురుగుల మందు కలిపాడు. తొలుత దాన్ని తండ్రికి ఇచ్చి, తర్వాత తానూ తాగాడు. వంటగదిలోనికి వెళ్లిన తల్లి వచ్చేలోపే ఇద్దరూ వాంతులు చేసుకోవడంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. దీంతో కంగారు పడ్డ శ్రావణి రెడ్డి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఇద్దర్నీ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనీష్‌ రెడ్డి మృతి చెందగా, రామిరెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ప్రస్తుతం క్రిటికల్‌ కేర్‌లో చికిత్స పొందుతున్నాడు.Show Full Article
Print Article
Next Story
More Stories