Bullet Train: ముంబై టు హైదరాబాద్‌ హైస్పీడ్‌ రైలు.. గంటకు 330 కి.మీ వేగం..

Bullet Train Between Mumbai and Hyderabad
x

Bullet Train: ముంబై టు హైదరాబాద్‌ హైస్పీడ్‌ రైలు.. గంటకు 330 కి.మీ వేగం.. 

Highlights

Bullet Train: ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న హైదరాబాద్ టూ ముంబై హై స్పీడ్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.

Bullet Train: ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న హైదరాబాద్ టూ ముంబై హై స్పీడ్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ కార్యాచరణ చేపట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 650 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్ వయాడక్ట్, టన్నెల్ కారిడార్ కోసం హెచ్ఎస్ఆర్ తాజాగా భూసేకరణ పనులను చేపట్టింది. ఈ మార్గంలో ఇప్పుడున్న 13 గంటల ప్రయాణాన్ని కుదించి 3 గంటల్లో గమ్యస్థానానికి చేర్చే బులెట్ ట్రైన్‌పై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి హైదరాబాద్‌కు హైస్పీడ్ రైల్ అందుబాటులోకి రానుంది. ప్రధాన నగరాల మధ్య రాకపోకలు పెంచడానికి దూర, సమయ భారాన్ని తగ్గించి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ కార్యాచరణ చేపట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 650 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్ వయాడక్ట్, టన్నెల్ కారిడార్ కోసం హెచ్‌ఎస్‌ఆర్ తాజాగా భూసేకరణ పనులను చేపట్టింది.

ఇక ఈ హైస్పీడ్ రైలు గంటకు 330 కి.మీ వేగంతో పరుగులు తీయగా 750 మంది ప్రయాణీకుల కెపాసిటీతో గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లోని 284 గ్రామాల్లో సుమారు 1197.5 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మహారాష్ట్రలోని నాలుగు జిల్లాలు థానె, రాయ్ పూర్, పుణె, షోలాపూర్, కర్ణాటకలోని గుల్బర్గా, తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించనున్నారు.

మొత్తంగా 10 స్టేషన్ల మీదుగా సాగే ఈ ట్రైన్ రాకపోకలతో కేవలం 3 గంటల్లో ముంబై టు హైదరాబాద్ చేరుకోవచ్చు. రెండు ప్రధాన నగరాల మధ్య రోడ్డు మార్గంలో వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొనేలా బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. అయితే ప్రజాభిప్రాయ సేకరణలో భూమి నష్టపోతున్న రైతులు, యజమానులు తమకు పరిహారం ప్రభుత్వ రేటు ప్రకారం కాకుండా మార్కెట్ విలువకు రెండు రెట్లు ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన 650 కి.మీ హైస్పీడ్ రైల్ మార్గం ద్వారా కేవలం 3 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories