నేను నా రాక్షసి సినిమా తరహాలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య

నేను నా రాక్షసి సినిమా తరహాలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య
x
నేను నా రాక్షసి సినిమా తరహాలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య
Highlights

ఆధునిక యువత పెడద్రోవ పడుతోంది. లోక కల్యాణానికి వినియోగించాల్సిన టెక్నాలజీని స్వనాశనానికి వాడుతోంది. తనలో ఉద్భవిస్తోన్న సరికొత్త ఆలోచనలను సమాజ...

ఆధునిక యువత పెడద్రోవ పడుతోంది. లోక కల్యాణానికి వినియోగించాల్సిన టెక్నాలజీని స్వనాశనానికి వాడుతోంది. తనలో ఉద్భవిస్తోన్న సరికొత్త ఆలోచనలను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాల్సిన యువత విధ్వంసానికి, విశృంకులత్వానికి ఉపయోగిస్తోంది. ముఖ్యంగా ఆధునిక యువతలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం దారుణాలకు దారి తీస్తోంది. మనిషి ప్రాణాలను కాపాడే టెక్నాలజీ లేదా వస్తువులతోనే తమ ఆయువును తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ బీటెక్ విద్యార్ధి ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు. చనిపోయిన తర్వాత ఏం జరగనుందో తెలుసుకోవాలంటూ బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చాడు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో బీటెక్ విద్యార్ధి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, గణేష్ ఆత్మహత్య చేసుకున్న తీరు కుటుంబ సభ్యులను నివ్వెరపోయేలా చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముఖానికి పాలిథిన్ కవర్‌ను కప్పుకున్న గణేష్‌ ముక్కులోకి నైట్రోజన్ ఆక్సిజన్‌ సిలిండర్ పైపులను పెట్టుకున్నాడు. దాంతో, రసాయన వాయువులు శరీరంలోకి వెళ్లి ఊపిరాడక మరణించాడు. అయితే, గణేష్ ఆత్మహత్య చేసుకున్న తీరే విస్తుగొలిపితే, అతను రాసిన సూసైడ్ నోట్ మరింత సంచలనంగా మారింది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందని, అందుకే చనిపోతున్నానంటూ అతుడు రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది.

ఆత్మహత్యకు ముందు వారం పది రోజులుగా ఈజీగా, ఎక్కువ బాధ లేకుండా ఎలా చనిపోవాలో గణేష్‌ యూట్యూబ్‌‌లో విపరీతంగా సెర్చ్‌ చేశాడు. అయితే, ఆత్మహత్యకు పక్కాగా ప్లాన్ వేసుకున్న గణేశ్ అందుకు అవసరమైన సామాన్లను ఒక్కొక్కటికి ఇంటికి తెచ్చుకున్నాడు. అలాగే, ఫిబ్రవరి 14న ఎర్రగడ్డలోని ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి దాదాపు మూడున్నర వేలు వెచ్చించి నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్‌‌ పైపులు పాలిథిన్ కవర్లు తీసుకొచ్చి దాచిపెట్టాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా స్టోర్ రూమ్‌లో వీటన్నింటినీ భద్రపర్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, నైట్రోజన్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పైపులను ముక్కులోకి పెట్టుకొని, ముఖాన్ని పాలిథిన్‌ కవర్లతో గట్టిగా చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందంటూ సూసైడ్ లెటర్ రాసిన రాతల్ని చూస్తే అతడి ఆలోచనా తీరు ఎంత దారుణంగా, తెలివి తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నంత మాత్రానా ఫలితం ఏమీ ఉండదన్న లాజిక్ ను మర్చిపోయాడు గణేష్. ఇక, ఆత్మహత్యకు ముందు -నేను నా రాక్షసి- సినిమాలో తేలికగా చనిపోయే కొన్ని దృశ్యాలు గణేష్‌ విపరీతంగా చూసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సినిమాలో బండరాళ్లు కట్టుకొని నీటిలో దూకడం, ఇంజక్షన్లు తీసుకొని శరీరం బండబారేలా చేసుకోవడం వంటివి చూసినట్లు తెలుస్తోంది.

గణేష్ ఆత్మహత్యకు టెక్నాలజీ అండ్ స్మార్ట్ ఫోనే కారణమంటున్నారు అతని స్నేహితులు. గణేష్ దగ్గర స్మార్ట్ ఫోనే లేకపోతే అసలు ఆత్మహత్య చేసుకునేవాడు కాదంటున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండటంతో సెర్చ్ చేసి మరీ సూసైడ్ చేసుకున్నాడని వాపోతున్నారు. ఇక, ఒక్కగానొక్క కుమారుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. చనిపోయి సాధించేదేమీ ఉండదు. ఏమీ ఉండదని చనిపోవటం మొదలుపెడితే ఎవరూ ఉండరు. జీవితాన్ని జీవించాలే కానీ ఇలా అర్థంలేని ఆలోచనలతో బలవన్మరణాలకు పాల్పడటం ఏమాత్రం సరికాదని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories