Hyderabad: హైదరాబాద్ హైదర్‌గూడలో విషాదం

Hyderabad: న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలుడు అనీష్ మిస్సింగ్

Sandeep Eggoju
Updated on: 22 Oct 2021 2:03 PM IST
Brutal in Hyderabad Hyderguda
X
హైదర్ గూడాలో మిస్సైన బాలుడు (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్ హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ కొండల్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌లో బాలుడు అనీష్ అదృశ్యమయ్యాడు. అయితే అతని మృతదేహం ఇంటి సమీపంలోని చెరువులో ప్రతక్ష్యమయింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ బిల్డింగ్‌పై నుంచి కిందికి వచ్చాడు. అయితే సాయంత్రం అయినప్పటికీ అతడు తిరిగి రాలేదు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇంటి సమీపంలో ఉన్న చెరువులో అతని మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, అనీష్‌ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story