KCR: కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం

KCR: బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 July 2024 10:16 PM IST
BRSLP meeting to be chaired by KCR tomorrow
X

KCR: కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం

KCR: అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా బీఆర్ఎస్ శాసనసభపక్ష రేపు సమావేశం కానుంది. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన భేటీకానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story