KTR: గ‌ల్ఫ్ జైలు నుంచి విడుద‌లైన బాధితుల‌కు కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

KTR: దుబాయి జైల్ నుండి విడిపించడానికి చేసిన..ప్రయత్నాలను బాధితులకు వివరించిన కేటీఆర్

Shekhar G
Published on: 28 Feb 2024 5:35 PM IST
Brs Working President KTR Visits Pedduru In Sircilla
X

KTR: గ‌ల్ఫ్ జైలు నుంచి విడుద‌లైన బాధితుల‌కు కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

KTR: రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెద్దూర్ గల్ఫ్ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సుమారు 18 సంవత్సరాలుగా దుబాయ్ జైల్లో శిక్ష అనుభవించి వచ్చిన పెద్దూరు గ్రామస్తులైన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిల ఇంటికి వెళ్ళిన కేటీఆర్ వారి కుటుంబసభ్యులతో గడిపారు. దుబాయి బాధితులకు ధైర్యాన్నిచ్చారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ వారికి ఎలాంటి సహాయం కావాలన్న చేస్తానని వారికి వెల్లడించారు.

సుమారు గంటకు పైగా వారితో సంభాషిస్తూ, దుబాయి జైల్ నుండి విడిపించడానికి తాము ఎలా ప్రయత్నించామో బాధితులకు వివరించారు. ఇంకా దుబాయి జైల్లో ఎంతమంది తెలంగాణ వాసులు మగ్గుతున్నారో అడిగి తెలుసుకొని, వారిని కూడా జైల్ నుండి విడిపించడానికి పార్టీ తరపున కృషిచేస్తానని హామీనిచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story