KTR: మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్

KTR: మూసీ ప్రాజెక్టు కోసం అంచనాలు మూడింతలు పెంచేశారన్న కేటీఆర్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 July 2024 4:27 PM IST
BRS Working President KTR tweeted about the beautification of Musi
X

KTR: మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్

KTR: మూసీ సుందరీకరణ కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. గతంలో ఈ ప్రాజెక్టు కోసం ఓ సారి 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని, ఇటీవల 70 వేల కోట్లని.. తాజాగా లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామనడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లు ఖర్చు చేస్తేనే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్నారు. అలాంటిది మరీ మూసీ సుందరీకరణకు లక్షా 50 వేల కోట్లా అంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story