ప్రధాని పర్యటనను టార్గెట్ చేసిన బీఆర్ఎస్.. రాష్ట్రస్థాయి అంశాలను లేవనెత్తి కేంద్రాన్ని కార్నర్ చేసే వ్యూహం

BRS Targets PM Modis Hyderabad Tour
x

ప్రధాని పర్యటనను టార్గెట్ చేసిన బీఆర్ఎస్.. రాష్ట్రస్థాయి అంశాలను లేవనెత్తి కేంద్రాన్ని కార్నర్ చేసే వ్యూహం

Highlights

PM Modi Tour: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో నిరసనలతో హోరెత్తించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది.

PM Modi Tour: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో నిరసనలతో హోరెత్తించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. సింగ‌రేణి ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు చేపట్టనుంది. ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, కొత్తగూడెం, రామ‌గుండం ఏరియాల్లో మ‌హా ధ‌ర్నాలు చేపట్టాలని శ్రేణులకు సూచించారు.

సింగ‌రేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రధాని మోడీ మాట ఇచ్చి త‌ప్పార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. లాభాల్లో ఉన్న సిగ‌రేణిని ప్రైవేటీకరించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వేలం లేకుండా సింగ‌రేణికి బొగ్గు గ‌నులు కేటాయించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్‌తో బీజేపీ నేతలకు షాక్ ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు దేశ ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తుంది. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పదేపదే టార్గెట్ చేస్తున్న మంత్రి కేటీఆర్ మోడీ ప్రోగ్రాంని కూడా టార్గెట్ చేశారు.

మొత్తానికి కేంద్రంతో తాడోపేడో తెలుసుకునే పనిలో గులాబీ పార్టీ అధిష్టానం ఉన్నట్టు అర్థమవుతుంది. రాష్ట్రస్థాయి అంశాలను లేవనెత్తి కేంద్రాన్ని కార్నర్ చేయాలని చూస్తున్నారు. అయితే హైదరాబాద్ వచ్చే మోడీ... కేసీఆర్ సర్కార్ టార్గెట్‌గా ఏం మాట్లాడుతారో అన్న ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories