బీఆర్ఎస్ కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ

Congress: కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు

Jyothi
Published on: 6 Feb 2024 12:12 PM IST
BRS MP Venkatesh Joins Congress
X

బీఆర్ఎస్ కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ

Congress: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు. మరో వైపు పలువురు బీఆర్ఎస్ నేతలు రేవంత్‌రెడ్డి ఆధ‌్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు మన్నే జీవన్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

Jyothi

Jyothi

Next Story