Sabitha Indra Reddy: కన్నీరు పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy: అసెంబ్లీ సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 July 2024 9:05 PM IST
BRS MLA Sabitha Indra Reddy burst into tears
X

Sabitha Indra Reddy: కన్నీరు పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy: సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మహిళా సభ్యులను అవమాన పరిచే విధంగా వ్యవరించారన్నారు. అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించి..నాకు అవకాశం ఇవ్వలేదన్నారు. సభలో ఏం జరిగిందో ప్రజలంతా చూశారన్నారు. పార్టీ మార్పుపై అడిగే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకొని సభకు వచ్చారంటా హేళన చేసే విధంగా మాట్లాడటం బాధాకరమంటూ మీడియా పాయింట్ లో సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story