KCR: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో గులాబీ నేతల భేటీ

KCR: ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కేసీఆర్‌ భేటీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Jun 2024 6:46 PM IST
BRS chief KCR meet with BRS leaders
X

KCR: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో గులాబీ నేతల భేటీ

KCR: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో గులాబీ నేతలు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో గులాబీ దళపతి సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదని, పోచారం పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేతలకు కేసీఆర్‌ సూచించారు. ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్‌ హయాంలోనే జరిగాయని, అయినా తాము భయపడలేదన్నారు. ఎవరూ తొందరపడొద్దని, భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్‌. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫెయిల్‌ అయ్యారని, రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా దెబ్బతిందన్నారు. రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని చెప్పారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story