కాంగ్రెస్‌లో చేరిన నిర్మల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత శ్రీహరిరావు

Revanth Reddy: పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు ఉంటుంది

Dhatripriya
Updated on: 14 Jun 2023 3:57 PM IST
కాంగ్రెస్‌లో చేరిన నిర్మల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత శ్రీహరిరావు
X

కాంగ్రెస్‌లో చేరిన నిర్మల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత శ్రీహరిరావు

Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీ.పీసీసీ చీఫ్ రేవంత్. పార్టీ గెలుపు కోసం పని చేసేవారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత శ్రీహరిరావు తన అనుచరులతో కలిసి గాంధీభవన్‌లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కండువా కప్పి వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రేవంత్. కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక ప్రజలకు లేదని..తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మల్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్.

Dhatripriya

Dhatripriya

Next Story