KTR: మార్చి 1 నుంచి బీఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డ కార్యక్రమం

KTR: తెలంగాణ రైతులు ఇబ్బందులు పడకూడదనే మా లక్ష్యం

Shekhar G
Published on: 27 Feb 2024 12:44 PM IST
BRS Call For Chalo Medigadda On March 1
X

KTR: మార్చి 1 నుంచి బీఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డ కార్యక్రమం

KTR: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ రగడ రేగుతున్న నేపథ్యంలో చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్‌. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం తరపున సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించారు. అయితే అదే రోజు తాము కూడా మేడిగడ్డకు వెల్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అందులో భాగంగానే మార్చి 1న చలో మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 150 మంది బీఆర్ఎస్‌ లీడర్లు మేడిగడ్డను సందర్శించనున్నారు. ప్రాజెక్టు సందర్శన సందర్భంగా వాస్తవాలు తెలిపేలా.. ప్రజలకు అన్ని విషయాలు కేసీఆర్‌ వివరిస్తారని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లకు కూడా తాము వెళ్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story