Kidnap Case: రెండేళ్ల క్రితం కిడ్నాప్.. తర్వాత ఫోన్‌లో ఆచూకీ

Kidnap Case: రెండేళ్ల క్రితం కామారెడ్డిలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ దొరికింది.

Arun Chilukuri
Published on: 21 March 2021 6:35 PM IST
Boy has Found After 2years Kidnap Case
X

Kidnap Case: రెండేళ్ల క్రితం కిడ్నాప్.. తర్వాత ఫోన్‌లో ఆచూకీ

Kidnap Case: రెండేళ్ల క్రితం కామారెడ్డిలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ దొరికింది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో బాలుడి ఆచూకీ కనిపెట్టారు పోలీసులు. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

రెండేళ్ల క్రితం కామారెడ్డి భరత్‌నగర్‌లో గణేష్ అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో కిడ్నాప్ చేసింది ఓ ముఠా. అందులో ఓ కిడ్నాపర్ బాలుడిని లక్షన్నర రూపాయలకు అమ్మేశాడు. అప్పటినుంచి బాలుడిని గాలించినా ఆచూకీ దొరకలేదు.

మూడ్రోజుల క్రితం కిడ్నాపరే స్వయంగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. తానే కిడ్నాప్ చేసి అమ్మేసినట్లు చెప్పాడు. కిడ్నాపర్ సమాచారం ఆధారంగా హైదరాబాద్ ముషీరాబాద్‌ ప్రాంతంలో బాలుడి ఆచూకీ కనిపెట్టారు పోలీసులు. రెండేళ్ల తర్వాత పిల్లాడు దొరకడంతో ఆనందంలో మునిగిపోయారు తల్లిదండ్రులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story