హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్‌.. హాజరైన ఆరోగ్యశాఖ అధికారులు

Harish Rao: ఇటీవల ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Shekhar G
Published on: 18 July 2023 6:57 PM IST
Board Meeting Under The Leadership Of Minister Harish Rao In Hyderabad
X

హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్‌.. హాజరైన ఆరోగ్యశాఖ అధికారులు

Harish Rao: ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధులతో లబ్ధిదారులకు అందించాలని మంత్రి హరీష్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల e KYC ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు అధ్వర్యంలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఇటీవల ఆరోగ్య శ్రీ పరిమితి 2 నుండి 5 లక్షలకు పెంచడంతో సదురు నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి తరహా సేవలను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చెందుకు కమిటీ వేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు నిర్ణయం తీసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story