Krishna Sagar Rao: దేశం మొత్తం ఎన్నికల ఖర్చు కేసీఆర్‌కు ఎలా సాధ్యం..

Krishna Sagar Rao: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 3 April 2023 5:29 PM IST
BJP Spokesperson Krishna Sagar Rao Fires on KCR
X

Krishna Sagar Rao: దేశం మొత్తం ఎన్నికల ఖర్చు కేసీఆర్‌కు ఎలా సాధ్యం..

Krishna Sagar Rao: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రత్యర్థి కూటమికి కేసీఆర్ ఛైర్మన్‌గా ఆశిస్తున్నట్లు.. ఓ ప్రముఖ జర్నలిస్ట్ రిలీజ్ చేసిన వీడియోలో ఉన్నట్లు వివరించారు. అయితే రెండు టర్మ్‌లు సీఎంగా ఉన్న వ్యక్తి 28 రాష్ట్రాలకు ఎన్నికల ఫండ్ ఎలా ఇవ్వగలడు అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు కృష్ణసాగర్ రావు. దేశం మొత్తం ఎన్నికల ఖర్చు కేసీఆర్‌కు ఎలా సాధ్యం అంటూ నిలదీశారు. ఎంత అవినీతికి పాల్పడితే ఇంతగా సంపాదిస్తారోనని అన్నారు. ఇది విపరీత పోకడగా బీజేపీ భావిస్తుందన్నారు కృష్ణసాగర్ రావు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story