నోవాటెల్‌లో మిథాలీరాజ్‌తో ముగిసిన జేపీ నడ్డా భేటీ

BJP National President JP Nadda Meets Former Cricketer Mithali Raj
x

నోవాటెల్‌లో మిథాలీరాజ్‌తో ముగిసిన జేపీ నడ్డా భేటీ

Highlights

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వరంగల్ లో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభ కోసం తెలంగాణ పర్యటనకు వచ్చారు.

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వరంగల్ లో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభ కోసం తెలంగాణ పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో జేపీ నడ్డాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ లతో పాటు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కాగా, జేపీ నడ్డా శంషాబాద్ నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కి వెళ్లారు. నోవాటెల్ లో బీజేపీ నేతలతో పాటు మిథాలీ రాజ్ తో నడ్డా భేటీ అయ్యారు.

మధ్యాహ్నం 2.40 గంటల​కు ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్తారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ నివాసానికి నడ్డా చేరుకుని వారితో మాట్లాడనున్నారు. సాయంత్రం హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ కి నడ్డా చేరుకుంటారు. వరంగల్ సభ అనంతరం హైదరాబాద్ కు జేపీ నడ్డా తిరుగుపయనం అవుతారు. రాత్రి 7.30 గంటలకు నోవాటెల్ లో నటుడు నితిన్ తో నడ్డా భేటీ కానున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories