Municipal Elections 2020: బీజేపీ మున్సిపల్ మేనిఫెస్టో విడుదల

S. Srikanth
Updated on: 17 Jan 2020 6:19 PM IST
Municipal Elections 2020: బీజేపీ మున్సిపల్ మేనిఫెస్టో విడుదల
X

మెదక్: అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టి... మెదక్ మున్సిపల్ ను కైవసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మెదక్ మున్సిపల్ ఇన్ ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రశ్నించే గొంతుక ఉండాలంటే బీజేపీని గెలిపించాలని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్, మల్లప్ప, నరసింహ గౌడ్, ఆకుల విజయ, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story