Raja Singh: పార్ట్‌-2 కూడా ఉంది.. రాజాసింగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

BJP MLA Raja Singh Arrested Over Prophet Muhammad Remark
x

Raja Singh: పార్ట్‌-2 కూడా ఉంది.. రాజాసింగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

Highlights

Raja Singh: తనపై నమోదవుతున్న కేసులపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు.

Raja Singh: తనపై నమోదవుతున్న కేసులపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. మునావర్‌ హైదరాబాద్‌ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముందే హెచ్చరించానని అయినా మునావర్‌తో షో జరిపించారన్నారు. రాముడిని కించపరిచిన వ్యక్తికి భద్రత ఎలా కల్పిస్తారంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. మునావర్‌కు కౌంటర్‌ వీడియోలు చేస్తానన్న రాజాసింగ్ యాక్షన్‌కు రియాక్షన్‌ కచ్చితంగా ఉంటుందన్నారు. కౌంటర్‌ వీడియోను యూ ట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్‌లోడ్‌ చేస్తాను. తనపై ఎలాంటి చర్యలకు దిగినా సిద్ధంగా ఉన్నానన్నారు.

ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో​పోలీసులు ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. డబీర్‌పురా పీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం రాజాసింగ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. ఇక, హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో రాజాసింగ్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories