బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Raja Singh: స్టాండప్ కమెడియన్ మునావర్ షో‌పై రాజాసింగ్ హాట్ కామెంట్స్

Jyothi
Published on: 20 Aug 2022 7:13 AM IST
BJP MLA Raja Singh Arrested
X

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Raja Singh: రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్‌లో నిర్వహించనున్నకామెడీ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ ప్రకటించడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో రాజాసింగ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, రాజాసింగ్ అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజాసింగ్ బయటకు రావొద్దని చెప్పినా వినలేదని, అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో రేపు మునావర్ షోకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్‌పై ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునావర్ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ ప్రకటించారు. ఆ షో సమయంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఆయన అనడం హాట్ టాపిక్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story