బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

BJP MLA Raja Singh Arrest in Hyderabad
x

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Highlights

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డిపేట వెళ్తుండగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది బీజేపీ నాయకులు గాయపడగా.. మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. కొంతమందితో కలిసి ఎల్లారెడ్డి పేటకు బయలుదేరారు. బీజేపీ కేడర్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న రాజాసింగ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories