Alleti Maheshwar Reddy: రంగనాథ్ పోలీస్ ఆఫీసరా..? పొలిటిషనా..?

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2024 10:35 AM IST
BJP MLA Alleti Maheshwar Reddy Comments On AV Ranganath
X

Alleti Maheshwar Reddy: రంగనాథ్ పోలీస్ ఆఫీసరా..? పొలిటిషనా..?

Alleti Maheshwar Reddy: హైడ్రాకు కొందరు సపోర్టు చేస్తున్నా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం ఏదైన పదవి ఆశ చూపి ఇలా చేయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. మీరు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారా లేక పొలిటిషన్ అనుకుంటున్నారా... విమర్శించే ముందు ఓసారి ఆలోచించుకోవాలన్నారు. కూల్చివేత విషయంలో ఓవైసీకి ఓ న్యాయం మిగతా వారికి మరో న్యాయామా అంటూ నిలదీశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

హై డ్రా కమిషనర్‎కు హై సెక్యూరిటీ అంటూ హంగామా చేస్తున్నారు. టెర్రరిస్టులు, నక్సల్స్‎తో పోరాడిన ఎంతో మంది అధికారులు ఉన్నారు. అంత కంటే ఏం ఎక్కువ చేశారని రంగనాథ్‎కు సెక్యూరిటీతో హైప్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎసా ... పొలిటికల్ లీడరా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story