ఎక్కడి వారు అక్కడే...బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని బీజేపీ నేతల ఇంటి పరిసరాల్లో నగర పోలీసులు భారీగా మోహరించారు.

Sumitra
Published on: 15 Jun 2020 1:25 PM IST
ఎక్కడి వారు అక్కడే...బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్
X

హైదరాబాద్ నగరంలోని బీజేపీ నేతల ఇంటి పరిసరాల్లో నగర పోలీసులు భారీగా మోహరించారు. లాక్ డౌన్ సమయంలో వాడిన విద్యుత్ కు ప్రజలమీద ప్రభుత్వం అడ్డగోలుగా బిల్లుల భారం మోపిందని, దీనిపై బీజేపీ రాష్ట్ర కమిటి నిరసన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నగరంలోని విద్యుత్ సౌధ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట ధర్నా చేయాలని నాయకులకు పిలుపునిచ్చింది. ఈ విషయం తెలియగానే ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతా చర్యలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రాం చందర్ రావు ను హైదరాబాద్ తార్నాకలోని తన ఇంట్లో హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. ముషీరాబాద్ అశోక్ నగర్ లో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఇంటి దగ్గర పోలీస్ లు మోహరించారు.

Sumitra

Sumitra

Next Story