NVSS Prabhakar: సంక్రాంతి తరువాత తెలంగాణలో కొత్త పార్టీ...

NVSS Prabhakar: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 5 Jan 2023 4:43 PM IST
BJP Leader NVSS Prabhakar Said New Regional Party Will Comes in Telangana
X

NVSS Prabhakar: సంక్రాంతి తరువాత తెలంగాణలో కొత్త పార్టీ... 

NVSS Prabhakar: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండగ తర్వాత కేసీఆర్‌ కనుసన్నల్లోనే మరో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతోందన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు పరిపాలనను గాలికొదిలేశారని ఆరోపించారు. విభజన సమస్యలపై కేంద్ర సమావేశానికి ఒకరు వస్తే మరొకరు రావడంలేదన్నారు. అవగాహనలో భాగంగానే కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌లకు రెండు రాష్ట్రాల సీఎంలు హాజరుకావడం లేదని ప్రభాకర్ ఆరోపించారు. నీటి పంపకాల విషయంలో ఇద్దరు సీఎంలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఠాగూర్‌ వెళ్లినా.. ఠాక్రే వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ.. కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవుతుందని సెటైర్లు వేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story