టీఆర్ఎస్ పై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపణలు

admin1
Updated on: 25 Jan 2020 10:33 PM IST
టీఆర్ఎస్ పై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపణలు
X

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందంటున్న కేసీఆర్, కేటీఆర్ సిరిసిల్లకు పోయి చూడాలంటూ చురకలంటించారు. ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ గణనీయమైన సీట్లు దక్కించుకుందని చెప్పారు. విజయంపై అంత నమ్మకం ఉంటే చైర్మన్ అభ్యర్థులను ముందుగా ఎందుకు ప్రకటించ లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్ పడిపోతుందని, కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని చెప్పారు.

admin1

admin1

Next Story