Telangana: నేడు బీజేపీ తొలి జాబితా?

Telangana: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ

Jyothi
Published on: 16 Oct 2023 10:01 AM IST
BJP Central Election Committee Meeting Today
X

Telangana: నేడు బీజేపీ తొలి జాబితా?

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. నేడో, రేపో తొలి విడత జాబితా విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలిజాబితా విడుదల చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీలో జరుగనున్న సీఈసీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో, రాష్ట్ర పార్టీ నుంచి అందిన అభ్యర్థుల జాబితాపై చర్చించి తొలిజాబితా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాష్ట్ర పార్టీ స్థాయిలో ముసాయిదా జాబితా కూడా సిద్థమైన నేపథ్యంలో 40-45 మందితో కూడిన అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. ఏకాభిప్రాయం కుదిరితే అంతకంటే ఎక్కువ సీట్లకే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మొదట బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఆదివారం బిఫారంలు కూడా అందజేశారు. అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా 55 మందితో తొలిజాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజే పీ అభ్యర్థుల జాబితాపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Jyothi

Jyothi

Next Story