Khammam: ఖమ్మంజిల్లాలో అడవిదున్న.. రహదారి పై సంచారం
Khammam: అడవులు అంతరించే క్రమంలో జనవాసాల్లోకి వన్యప్రాణులు
Khammam: ఖమ్మంజిల్లాలో అడవిదున్న.. రహదారి పై సంచారం
Khammam: ఖమ్మం జిల్లా లో అడవిదున్న కలకలం సృష్టించింది. ఏన్కూర్ మండల పరిధిలోని తిమ్మారావుపేట నుండి కారేపల్లి మండలంలోని చీమలపాడు వెళ్లే రహదారి పై అడివి దున్న సంచారం చేసింది. అడవులు అంతరించే క్రమంలో జనవాసాల్లోకి వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏన్కూరు మండల పరిధిలోని తిమ్మరావు పేట, చీమలపాడు వెళ్లే రహదారి అటవీప్రాంతంలో ఉంది . అడవిదున్న రోడ్డు దాటే క్రమంలో..అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ చరవాణిలో వీడియోని చిత్రీకరించాడు. అది సామజిక మాధ్యమాల్లో పెట్టడంతో చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Next Story




